ఆంధ్రప్రదేశ్ సహా పలుచోట్ల పాస్‌పోర్టు సేవలలో అంతరాయం తలెత్తింది. ఏపీలోని విజయవాడ, తిరుపతిలో సర్వర్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి, విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలలో సర్వర్లు మొరాయించాయి. దీంతో పాస్‌పోర్టు కార్యాలయాలకు వచ్చిన ప్రజలను అధికారులు వెనక్కి పంపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సర్వర్లు పనిచేయటం లేదని.. మరుసటి రోజు రావాలంటూ ప్రజలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి పాస్ పోర్టు సేవల కోసం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల వద్దకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ముందు పడిగాపులు కాస్తున్నారు.మరోవైపు సర్వర్లు పనిచేయడం లేదనే విషయంపై అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమకు కేటాయించిన స్లాట్ ప్రకారం వచ్చామని.. తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత సర్వర్లు పనిచేయలేదని చెప్తున్నారని వాపోతున్నారు. టెక్నికల్ సమస్యపై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు ముందస్తు సమాచారం ఇస్తే సరిపోయేదని విమర్శిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత.. ఇప్పుడు సర్వర్ సమస్య గురించి చెప్పడం ఏమిటని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. మరోవైపు కార్యాలయం వద్ద కనీస సదుపాయాలు లేవని.. మంచినీరు, సరిపడా కుర్చీలు, వాష్‌రూమ్‌లు లేవని తిరుపతి పాస్ పోర్టు ప్రాంతీయ కార్యాలయం వద్దకు వచ్చిన దరఖాస్తుదారులు వాపోయారు.మరోవైపు వీసాల మంజూరు, విదేశీ ప్రయాణాల కోసం పాస్‌పోర్ట్ తప్పనిసరి. అంతటి కీలకమైన పాస్‌పోర్టు సేవలు అందించే కార్యాలయాలలో కనీస వసతులు లేకపోవడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాస్‌పోర్టు కేంద్రాలలో సర్వర్ల సమస్యను వెంటనే పరిష్కరించకుండా.. ఇలా కొనసాగించడం ఏమిటని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ కార్యాలయాలలో సర్వర్ డౌన్ అయ్యిందని.. దీంతో సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. చాలాచోట్ల మంగళవారం నాటి అపాయింట్మెంట్లను అధికారులు మరో రోజుకు రీషెడ్యూల్ చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎంజీబీఎస్ పాస్‌పోర్ట్ కేంద్రం వద్ద కూడా ప్రజలు బారులు తీరారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని