
వినుకొండ : పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని, స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఉద్యమంగా మార్చాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం ఓబయ్య కాలనీలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్త వర్గీకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే, ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. ఆయన వెంట డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.