
Pallaburusu Review : సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్స్ నిర్మాణంలో ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పళ్ళ బురుసు సినిమా నేడు ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అయింది. ముసలాయన శంభు(సుధాకర్ రెడ్డి)ఒంటరిగా ఓ గ్రామంలో నివసిస్తుంటారు. దగ్గర్లోనే వేరే గ్రామంలో అతని కొడుకు తిరుపతి(మురళీధర్ గౌడ్) తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. శంభుకు పన్ను సమస్య రావడంతో హాస్పిటల్ కి వెళ్తే వేపపుల్ల వాడకుండా బ్రష్(పళ్ళ బురుసు)తో పళ్ళు తోమమని చెప్తారు. దాంతో పళ్ళ బురుసు, మెడిసిన్స్ తీసుకురమ్మని తన కొడుక్కి చెప్తాడు శంభు. కానీ తిరుపతి తీసుకురాడు. అంతే కాక తిరుపతి తన కూతురు పెళ్లి ఫిక్స్ అయినా, నిశ్చితార్థం అయినా, పెళ్ళికి కూడా తన తండ్రికి చెప్పడు, పిలవడు. అయినా మనవరాలి పెళ్లి అని శంభు పెళ్ళికి వెళ్తే ఎవరూ పట్టించుకోరు. ఒంటరితనంతో బాధపడుతూ ఉంటాడు. దీంతో తన కొడుకు తనకు పళ్ళ బురుసు కొనివ్వలేదని, మనవరాలి పెళ్ళికి పిలవలేదని, అసలు తనను పట్టించుకోవట్లేదని కోర్టులో కేసు వేస్తాడు శంభు. అదే సమయంలో కూతురు పెళ్లి చేసి అప్పుల పాలవుతాడు తిరుపతి. మరి ఈ కేసుకి తిరుపతి ఎలా స్పందిస్తాడు? తన తండ్రిని తిరుపతి అర్ధం చేసుకుంటాడా? ఒంటరితనంతో శంభు ఏం చేస్తాడు? ఈ మధ్యలో రవి- శ్వేత ప్రేమాయణం సంగతి ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. Also See : Anna Konidela : మొదటిసారి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ భార్య.. ట్రైన్లో వెళ్లి పూజలు చేసి.. అన్నా కొణిదెల ఫొటోలు వైరల్.. బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ఆసక్తి నెలకొల్పింది. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ