డ్రాగన్ (Dragon)

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 6 భారీగా తగ్గిందోచ్

బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఫోన్ మరింత తగ్గింపు

నెలకు రూ. 1,256 నుంచి ఈఎంఐ ఆప్షన్

OnePlus Nord CE 6 Price : వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి బిగ్ న్యూస్.. మెమరీ చిప్‌ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగాపెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడమే కష్టం.. అలాంటి ఇప్పుడు వన్‌ప్లస్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6పై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తోంది.

ఈ ఫోన్ అసలు ధర రూ. 37,999 ఉండగా ప్రస్తుతం రూ. 2వేలకు పైగా తగ్గింపుతో లభ్యమవుతోంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఇంకా తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్-కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్సెట్ కూడా ఉంది. లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 6 డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 కేవలం రూ. 35,732కే లభిస్తోంది. అసలు ధర రూ. 37,999 ఉండగా రూ. 2,267 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు అదనంగా రూ. 1,787 తగ్గింపు పొందవచ్చు. తద్వారా అసలు ధర రూ. 33,945కు తగ్గుతుంది. ఈ బ్రాండ్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. 36 నెలల్లో నెలకు కేవలం రూ. 1,256 నుంచి ఈఎంఐ చెల్లించవచ్చు.

Read Also : Apple iPhone 17 Pro Max : కొంటే ఐఫోన్ కొనాలి.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అయితే బాధపడతారు!

వన్‌ప్లస్ నార్డ్ CE 6 కొనాలా? వద్దా? :
ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 6 ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంది. 8GB LPDDR5 ర్యామ్, 128GB లేదా 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16.0పై రన్ అవుతుంది.

డిస్ప్లే విషయానికి వస్తే.. 1272 × 2772 పిక్సెల్, 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల సన్‌బర్స్ట్ అమోల్డ్ ప్యానెల్ ఉంది. ఈ డిస్ప్లే 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 3,600 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందుకోగలదు.