
త్వరలో వన్‌ప్లస్ 16 సిరీస్ లాంచ్ 200MP కెమెరా, భారీ 9000mAh బ్యాటరీ సరికొత్త జనరేషన్ ఫ్లాగ్షిప్ ఇమేజింగ్ టెక్నాలజీ OnePlus 16 : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో చైనాలో వన్‌ప్లస్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లో 200MP కెమెరా, భారీ 9000mAh బ్యాటరీ ఉండొచ్చని అంచనా. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గత ఏడాది చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 15కి అప్‌గ్రేడ్‌గా రానుంది. ఈ ఫోన్ డిజైన్‌లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి. కెమెరాలో భారీ అప్‌గ్రేడ్ : వన్‌ప్లస్ 16లో కీలక అప్గ్రేడ్లు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్లో 200MP మెయిన్ సెన్సార్ ఉండొచ్చు. 50MP సోనీ పెరిస్కోప్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. 50MP ఆటోఫోకస్ కెమెరాతో ఫస్ట్ వన్‌ప్లస్ ఫోన్ ఇదే కానుంది. టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ 16 సరికొత్త జనరేషన్ ఫ్లాగ్షిప్ ఇమేజింగ్ టెక్నాలజీతో రానుంది. అంతేకాదు.. లీక్‌ల ప్రకారం ఈ ఫోన్లో 185Hz రిఫ్రెష్ రేట్‌తో BOE డిస్ప్లే ఉండొచ్చు. అదనంగా, ఈ-స్పోర్ట్స్ గేమింగ్ కోసం ట్రిపుల్-కోర్ టెక్నాలజీతో రానుంది. Read Also : Redmi K100 Leak : బ్యాటరీ బీస్ట్ వస్తోందోచ్.. ఈ కొత్త రెడ్మి K100 సిరీస్ రేంజే వేరబ్బా.. ఫీచర్లు చూస్తే ఫిదానే..! వన్‌ప్లస్ 16లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ఉంటుందని అంచనా. ఈ ఫోన్లో 24GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ పవర్ఫుల్ 9000mAh బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ఓఎస్ 17కు సపోర్ట్ చేస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ IP68/IP69 ప్రొటెక్షన్‌ను అందిస్తుందని అంచనా. వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. భారత మార్కెట్లో లేనట్టేనా? : వన్‌ప్లస్ 16కు సంబంధించిన టీజర్ రివీల్ అయింది. అందులో ఆ ఫోన్ ఒకటి కనిపిస్తోంది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కాదు. అమెరికా, యూరప్ తర్వాత వన్‌ప్లస్ ఇప్పుడు భారత మార్కెట్లో కూడా క్లోజ్ చేయనుంది. అయితే, ప్రస్తుతం కంపెనీ దీనిపై అధికారికంగా వెల్లడించలేదు.



