© 2026 nimisham.in

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. అభిమనులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆయన బర్త్ డే రోజున సందర్భంగా అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అద్భుతమైన బిగ్ సర్ప్రైజ్ లభించింది. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ నుంచి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సినిమా విజన్ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ.. సౌత్ ఈస్ట్ ఎమోషన్స్, ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌ను వెస్ట్రన్ శైలిలో ప్రజెంట్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ రోజుల నుంచి నేటి 1970ల కాలం దాకా సాగే ఈ కథాంశంలో అద్భుతమైన పొటెన్షియల్ ఉందని, ప్రతి ఒక్కరం మన లైఫ్‌టైమ్‌లో ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్లకు పవన్ కళ్యాణ్ సూచించారు.ఈ చిత్రంలో జపనీస్ సంస్కృతికి చెందిన సమురాయ్ ఎలిమెంట్స్, జపాన్ యాకుజా నేపథ్యం కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక వీడియోలో పవన్ సమురాయ్ కత్తి పట్టుకొని ఓజస్ గంభీర ఎంతో గాంభీర్యంగా కనిపించారు.
'సమురాయ్ రేమై.. యాకుజా మేకై' అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో ఈ ఓజీ విశ్వం యొక్క విస్తృతిని పరిచయం చేశారు. ఓజీ యూనివర్స్ గురించి పవన్, తమన్, సుజీత్ మాట్లాడుతూ.. 'మన కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ సార్ అని తమన్ అనగా ఇది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని సుజీత్ అనడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. తమన్ అందించిన నేపధ్య సంగీతం, యానిమేషన్ శైలిలోని విజువల్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ చిత్రంతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.