© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. CM Yogi Adityanath Serious: అయోధ్య రామ మందిరంలో భక్తుల కానుకలు పక్కదోవపట్టించారనే విషయం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. అయోధ్య రామమందిరం నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. కానుకల చోరీకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ కీలకశాఖల్లో ఉన్న ముగ్గురు ప్రభుత్వ సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటుచేశారు. కానులను దారిమళ్లిన కేసును లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. తప్పుచేసిన వారిని వదిలిపెట్టొద్ధనే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులను విచారించారు. ఆలయ ఉద్యోగులను విచారించి కానులను తస్కరించిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 80లక్షల మేర నగదును రికవరీ చేశారు. అయోధ్య కానుకల కేసులో ఆసక్తికర విషయాలు.. రామమందిరానికి భక్తులు అందించిన విరాళాలను, బంగారం, వెండి ఆభరణాలను, హుండీ కానుకలను దశలవారీగా ఆలయ ఉద్యోగులే దోచుకెళ్లారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. సిట్ అధికారులు రంగంలోకి దిగగానే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. మహా కుంభమేళా సమయంలో భారీ ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని、ట్రస్ట్ ఉద్యోగులు కొందరు చేతివాటం ప్రదర్శించి సొమ్ము చేసుకున్నారని పోలీసులు తేల్చారు. భక్తులు సమర్పించిన హుండీల్లో డబ్బును ట్రస్ట్ ఉద్యోగులు దొంగిలించారని విచారణ అధికారులు గుర్తించారు。స్వామివారికి కానుకగా అందించిన బంగారు ఆభరణాలను తూకం వేసే సమయంలో మోసం జరిగిందని దర్యాప్తులో తేలింది。ఈ
కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆలయ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు。నిందితుల్లో కొంతమంది ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి సన్నిహితులుగా ఉన్నారు。అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో శ్రీరామ జన్మభూమి ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నోరువిప్పారు. తనపై వస్తోన్న ఆరోపణలు నిరాధారమన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాతే ఈ వ్యవహారంపై మాట్లాడుతామని ఓ లేఖ విడుదల చేశారు. 1991 నుంచి రామమందిరంలో పని చేస్తున్నానని పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రచారక్‌గా సేవలందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
రాములోరి కానుకలు కోట్లాది రూపాయలు మాయమయ్యాయని、భూముల కొనుగోలులోనూ అవినీతి జరిగిందని రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు చేశారు。దీనిపై స్పష్టత కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది。ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితుల ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు。ప్రత్యేక బృంద దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రామ మందిర విరాళాల దోపిడీకి సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది. గతేడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సమయంలోనే భారీగా దోచేసినట్టు విచారణలో తేలింది. ఆలయంలో భక్తులు వేసిన కానుకలను, విరాళాలను కొంతమంది సిబ్బంది క్రమపద్ధతిలో పక్కదారి పట్టించారు. ఒకరు సీసీ కెమెరాకు అడ్డంగా నిలబడితే, మరొకరు హుండీలోని డబ్బును దొంగిలించేవారు. మహాకుంభమేళాకు ముందు కొందరు దొంగతనానికి అలవాటు పడ్డారు. కుంభమేళా సమయంలో మరి కొంతమంది కలిసి దోచుకున్నారు. నగదు కట్టలతోపాటు బంగారం, వెండి వంటి విలువైన కానుకలను అపహరించారు. ప్రత్యేక అధికారుల బృందం దర్యాప్తును వేగవంతం చేశారు. దొంగతనానికి పాల్పడిన మందిర ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారించారు. దొంగిలించిన డబ్బులో కొంత భాగాన్ని నిందితుల ఇళ్లల్లో స్వాధీనం చేసుకున్నారు. అవినాష్ శుక్లా కౌశల్పురిలోని రహస్య స్థావరం నుంచి అత్యధిక నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అవినాష్ శుక్లా సోదరుడు అభిషేక్‌కు సంబంధించిన యోగ కేంద్రంపై పోలీసులు జూన్ 5 దాడిచేసి భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్‌కు చెందిన నాలుగు పెట్టెలను యోగా కేంద్రంలో ఉంచారు.
చోరీకి పాల్పడుతున్న వారిని గుర్తించినా… వారించని అధికారులు.. ఆలయ ఉద్యోగుల్లో లవ్కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే ఇద్దరు బావమరుదుల జోడి అధిక మొత్తంలో నగదును దొంగిలించినట్లు తేలింది. అంతేకాదు, తస్కరించిన ఈ సొమ్ముతో వారు పలు ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్టు సమాచారం. వీరిద్దరికీ సంబంధించి దాదాపు అర డజనుకుపైగా ఆస్తులను పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. వీరి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులను నిశితంగా పరిశీలించేందుకు పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సహాయం తీసుకున్నారు. అలాగే, మనీల్యాండరింగ్, ఆర్థిక వ్యవహారాలపై లోతైన విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాయాలని సన్నాహాలు చేస్తున్నారు.
పోలీసులు నిందితులందరి ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ ఇంట్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. టిన్ను యాదవ్ వద్ద కౌంటింగ్ గదికి ఒక తాళం వేయగా, రెండో తాళం బ్యాంకు సిబ్బంది వద్ద ఉన్నట్లు విచారణలో తేలింది. బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దొంగిలించిన సొమ్మును టిన్ను యాదవ్, బ్యాంకు ఉద్యోగులు వాటాలు వేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియమితులయ్యారు. విరాళాల దుర్వినియోగం నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చేసిన రాజీనామాను ఆమోదించిన ట్రస్టు.. తాత్కాలిక సారథిని నియమించింది. దీంతోపాటు కొత్తగా ట్రస్టుకు సీఈవోను నియమించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఆలయ ఉద్యోగులే దొంగతనాలకు పాల్పడ్డారని గుర్తించిన సిట్... రామ మందిర విరాళాలను ఆలయ ఉద్యోగులే దారిమళ్లించిన కేసులో దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. రామమందిరంలో హుండీ లెక్కింపు సమయంలో లెక్కించినవారే నగదు దొంగిలించుకు పోయారని సీసీటీవీల ద్వారా గుర్తించారు. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు లభించిన వీడియోలను పరిశీలించిన అధికారులు… ప్రతిసెకను వీడియోఫుటేజిని నిశితంగా పరిశీలించారు. 39 రోజుల్లో లెక్కించే సమయంలో ఆలయ సిబ్బంది కరెన్సీ నోట్ల కట్టలను, చిల్లర నాణేలను వేసుకున్న దుస్తులు, జేబులు, బూట్లలో దాచిపెట్టినట్లు సీసీటీవీ రికార్డుల్లో గుర్తించారు. ఆలయం లో భద్రతా తనిఖీలు, బయోమెట్రిక్ హాజరు, డిజిటల్ పరికరాలపై పరిమితులు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యల్లో అనేక లోపాలు గుర్తించారు. బ్యాంకు రికార్డులు, విరాళాల పత్రాలు, ఆలయ నిర్మాణ వ్యయాలు, బంగారం, వెండి వస్తువులతో సహా అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. హుండీ లెక్కింపు సమయంలో డబ్బును సిబ్బంది దొంగిలించడాన్ని గమనించి అధికారులు మందలించడంగానీ, నియంత్రించే ప్రయత్నం చేయలేదని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
రాములవారికి భక్తులు అందించిన కానుకల్లో విలువైన బంగారం పూతరేకులపై రామచరిత మానస్, వెండి హారం, పాదుకలు, వెండి చిలకతో సహా విలువైన ఆభరణాలు భద్రంగా ఉన్నాయని రామ మందిర ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన బంగారు, వజ్రాల ఆభరణాలను, రూ. 5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ప్రతిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రదర్శించింది. ట్రస్ట్ సభ్యులు సుమారు 2,800 కానుకల వివరాలతో కూడిన రికార్డులను బయటపెట్టారు. ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆలయానికి అందిన కానుకలతో పాటు, ప్రాణప్రతిష్ట సమయంలో బాలరాముడికి లక్నోకు చెందిన జ్యూవెలర్స్ తయారు చేసిన వజ్రాలు, కెంపులు, పచ్చలతో కూడిన ఆభరణాలను అలంకరించారు. ఒక కిలో 700 గ్రాముల బంగారు ముకుటం ప్రదర్శనలో ఆకర్షణీయంగా మారింది. రాముడి విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణల నేపథ్యంలో రామతీర్థ ట్రస్టు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. భక్తులు సమర్పించిన కానుకలకు భద్రత విషయంలో ట్రస్ట్ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో కీలకమైన కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తెలిపారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలు అన్నీ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మార్చి 31, 2026 నాటికి ట్రస్ట్ వద్ద 32.259 కిలోల బంగారం, 1,518.925 కిలోల వెండి నిల్వలు ఉన్నాయని గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.