
ర్లాఖెముండి: గజపతి జిల్లాలోని పలు ఠాణా పరిధిలోని పాఠశాలల్లో మంగళవారం సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుసాని సమితి గురండి ఠాణా పరిధిలోని గ్రామ ప్రాంతంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై అంబికా బెనియా మాట్లాడుతూ.. అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని తెలిపారు. తక్కువ సమయంలో పెట్టుబడులను రెట్టింపు చేస్తామని చాలా మంది మోసగాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోకూడదన్నారు.అటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, లేదా 1930 నెంబర్‌కు తెలియజేయాలన్నారు. వాట్సప్‌లో వచ్చే లింక్‌లు ఓపెన్ చేయొద్దని సూచించారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.