
పర్లాఖెముండి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నేపథ్యంలో గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని గజపతి క్రీడా మైదానంలో మంగళవారం నుంచి కవాతు సాధన కార్యక్రమం ప్రారంభమైంది. పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, పోలీసు బృందాలు పాల్గొని కవాతు చేపట్టారు. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగుతుందని అదేవిధంగా ప్రస్తుతానికి 24 బృందాలు పెరేడ్లో పాల్గొన్నాయని జిల్లా సమాచార శాఖ అధికారి ప్రదీప్త గుర్మయ్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.