
బరగఢ్: బరగఢ్ కృష్ణ వికాస్ రెసిడెన్షియల్ స్కూల్ (కృష్ణ వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్) ఆవరణలో ‘క్విట్ ఇండియా ఉద్యమం’ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన పలువురు ప్రముఖ మహానాయకుల పాత్రలను విద్యార్థులు తమ అభినయంతో రంగస్థలంపై ప్రతిబింబించారు. నాటకాలు, రోల్ ప్లే (పాత్రపోషణ), ప్రదర్శనల ద్వారా క్విట్ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యతను, దేశ నాయకుల త్యాగాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమం దోహదపడిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ తరహా ప్రయోగాత్మక అభ్యాసం ద్వారా విద్యార్థులకు దేశ చరిత్ర, దేశభక్తి, సంస్కృతిపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.