
గుణుపురం: వంశధార నీటి కోసం అవసరమైతే ఆందోళనలు, పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దండకారణ్య వికాస్ మంచ్ ప్రకటించింది. సోమవారం ఉదయం రాయగడ జిల్లా గుణుపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వికాస్ మంచ్ అధ్యక్షులు గౌరొ త్రిపాఠి విలేకరులతో మాట్లాడారు. వంశధార నది అందరిది. ఈ వంశధార నది ఒడిశా రాష్ట్రం లంజిఘడ్ లో పుట్టి రాయగడ, గజపతి, జిల్లాల మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లో సముద్రంలో కలుస్తుంది. 1961 సంవత్సరం నుంచి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉంది. ఇటీవల జల వివాదం ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. గుడారి ఎగువన మినాజులా వద్ద జలాశయం, పాణిడొంగొరొ వద్ద బ్యారేజి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుణుపురం, గజపతి జిల్లాల నుంచి వంశధార పరి రక్షణ సమితి ప్రముఖులు హాజరయ్యారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




