
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో .. కేదార్నాథ్(Kedarnath) మార్గంలో ఉన్న ట్రెక్కింగ్ రూట్లో రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. మంగళవారం అక్కడ నుంచి సుమారు 150 మందిని రక్షించారు. దీంతో మొత్తం ఆ ప్రాంతం నుంచి 7350 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఈ విషయాన్ని ఇవాళ తెలిపింది. ఎస్ఈఓసీ రిపోర్టు ప్రకారం కేదార్నాథ్ థామ్ నుంచి తిరుగు ప్రయాణం అవుతున్న వారిని చిర్బాసా వద్ద రక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం చిర్బాసా వద్ద ఇంకా శిథిలాలను తొలగిస్తున్నారు. కొండ రాళ్లు కింద పడడం వల్ల .. రెండు రోజుల క్రితమే ట్రెక్కింగ్ మార్గాన్ని ఆపేశారు. అయితే ఇవాళ మళ్లీ ఆ రూట్‌ను ఓపెన్ చేశారు. దీంతో పాటు హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. యాత్రికులతో పాటు సుమారు 1200 గుర్రాలను కూడా రక్షించారు. గౌరికుండ్‌కు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిర్బాసా హెలిప్యాడ్ సమీపంలో క్లియరెన్స్ పనులు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన ఆ మార్గాన్ని ఓపెన్ చేసేందుకు పనిచేస్తున్నారు. అయితే చిర్బాసా మార్గాన్ని పూర్తిగా క్లియర్ చేసిన తర్వాతే యాత్రికులను ఆ మార్గంలో కేదార్నాథ్ పంపించనున్నారు. కాలినడకన వెళ్లే వారు సోన్‌ప్రయాగ్, గౌరికుండ్ వద్ద నిలిచిపోయారు. जनपद रुद्रप्रयाग के चीरबासा में केदारनाथ पैदल मार्ग पर पहाड़ी से पत्थर गिरने के खतरे को देखते हुए प्रशासन के द्वारा हेलमेट पहनाकर यात्रियों को सुरक्षित निकाला जा रहा है। #Kedarnath #Rudraprayag #Uttarakhand pic.twitter.com/gf0ARrJA46 — Uttarakhand DIPR (@DIPR_UK) September 15, 2026





