
మద్నూర్: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోనాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్(31) గత కొంత కాలంగా మద్నూర్ ఇందిరానగర్ కాలనీలో ఉంటున్నారు. చంద్రశేఖర్ ఉదయం ఇంట్లో స్నానం చేయడానికి వెళ్లగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. పెద్ద శబ్దం రావడంతో గమనించిన కుటుంబీకులు అతనిని దెగ్లూర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.