
కాఫీ పొడిలో కొద్దిగా తేనె కలిపి చర్మానికి బాగా రాసుకోండి. అరగంట సేపు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. స్కిన్ గ్లో పెరుగుతుంది.
బొప్పాయిలోని ఎంజైమ్స్ చర్మంపై మృత కణాలను తొలగించి స్కిన్ గ్లో పెంచుతాయి. దీనికోసం పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోండి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో క్లీన్ చేసుకుంటే చాలు.
బాదం గింజలను పొడిలాగా చేసి అందులో పాలు కలపండి. దీనిని ముఖానికి రాసుకుని మర్దన చేయండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చర్మం గ్లో పెరుగుతుంది.
ఓట్స్, తేనె నేచురల్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేసి చర్మాన్ని అందంగా మారుస్తుంది. దీనికోసం ఓట్స్ పొడిలో తేనె కలిపి ముఖానికి రాసుకుని మర్దన చేయండి. అరగంట ఉంచి గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు.
పెరుగు చర్మాన్ని మెరిపిస్తుంది. తేనె స్కిన్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. దీనికోసం పెరుగులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోండి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో క్లీన్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
నిమ్మరసం, చక్కెర నేచురల్ బ్లీచింగ్ మాదిరి పనిచేసి చర్మంపై నల్ల మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ తొలగిస్తుంది. స్కిన్ గ్లో పెంచుతుంది. దీనికోసం నిమ్మరసంలో చక్కెర కలిపి ముఖానికి రాసుకోండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చాలు.
కీరదోసను గుజ్జులాగా చేసి అందులో చక్కెర కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి. అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
ముఖంపై రంధ్రాలు తొలగించి జిడ్డు పోగొట్టడంలో ఈ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. దీనికోసం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి అప్లై చేయండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే మంచిది. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోండి.
మీరు ఎలాంటి ఫేస్ ప్యాక్ వాడే ముందు అయినా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఏదైనా ఎలర్జీ కనిపిస్తే దానిని ఉపయోగించొద్దు. అలాగే ఫేస్ ప్యాక్ అప్లై చేసి క్లీన్ చేసుకున్నాక తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.




