
© 2026 nimisham.in

ఏపీ నుంచి కౌలూరి రాజేష్ తెలంగాణ నుంచి బొంపెల్లి భవాని అండమాన్ నికోబార్ దీవుల నుంచి జెల్లి ప్రకాశ్‌రావు
ఈనాడు-దిల్లీ, నెల్లిమర్ల-న్యూస్‌టుడే: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు టీచర్లు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్, అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయాబందర్ పీఎంశ్రీ జీఎంఎస్‌ఎస్‌ఎస్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(ఇంగ్లిష్)గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జెల్లి ప్రకాశ్‌రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవానిలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ 5న నిర్వహించే గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర విద్యాశాఖ శుక్రవారం దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను ఈ పురష్కారానికి ఎంపిక చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.








