
కింగ్ నాగార్జున తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కింగ్ నాగార్జున (Nagarjuna) తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన ఇద్దరు కుమారులు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్‌తో (Akhil) కలిసి ‘వెరైటీ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 90వ దశకానికి, ఇప్పటి సినీ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి మాట్లాడారు. "నా సినీ ప్రయాణంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా కెరీర్‌ను పూర్తిగా మార్చేశాయి. అలాంటి నిర్ణయాల్లో ‘గీతాంజలి’ (Geethanjali) సినిమా ఒకటి. 90వ దశకంలో ఇతర హీరోలు పెద్దగా ముందుకు రాని సమయంలో దర్శకుడు మణిరత్నంతో కలిసి ‘గీతాంజలి’ సినిమా చేయడం నేను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయమే నా కెరీర్‌కు ఒక కొత్త దిశను చూపించింది. ఒక హీరోగా నేను ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి కథలను ఎంచుకోవాలి అనే విషయంలో ‘గీతాంజలి’ నాకు ఎంతో నేర్పింది. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు నా కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. కెరీర్లో ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండకుండా.. కొత్త కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమాలు చేయాలనే తపన ఉండాలి. అయితే 90లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేయడం కొంత సులభంగా ఉండేది. సినిమా ఫలితం ఆశించిన విధంగా రాకపోయినా మరో సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండేది. ఆ రోజుల్లో వరుసగా ఏడు సినిమాలు ప్లాప్ అయినా హీరోలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్క పరాజయం ఎదురైనా ప్రేక్షకులు