
Chiranjeevi
మైత్రీ మూవీ మేకర్స్ కు శ్రావణ శుక్రవారం భలే కలిసొచ్చింది. ఈ రోజున ఆ సంస్థ నుంచి విడుదలైన రెండు సినిమాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో 'ఇరుముడి' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే, 'ఇరుముడి కట్టు' పేరుతో తమిళంలో ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీమేకర్స్ తీసిన మరో సినిమా 'మొద రాత్రి' కూడా విడుదలై యూత్ ను ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్‌కు 'పుష్ప 2' సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయం దక్కలేదు. అయితే వరుస పరాజయాలతో సాగుతున్న ఈ నిర్మాణ సంస్థ ఒకే రోజున రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అది ఒకటి రవితేజ నటించిన 'ఇరుముడి' కాగా, మరొకటి తమిళంలో విడుదలైన 'మొద రాత్రి'. అయితే ఇందులో 'ఇరుముడి' సినిమా తమిళంలోనూ 'ఇరుముడి కట్టు' పేరుతో విడుదలైంది. సహజంగా తెలుగు నుంచి తమిళంలోకి అనువాదమైన సినిమాలు అక్కడ పెద్దంత విజయాన్ని అందుకున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. కానీ రవితేజ టైమ్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ టైమ్ కూడా బాగుంది. 'ఇరుముడి కట్టు' సినిమాకు తమిళనాడులో మంచిస్పందన లభిస్తోంది. తెలుగులో ఈ సినిమా ఇప్పటికే బిగ్ హిట్ అనే టాక్ సంపాదించుకొంది. తమిళంలోనూ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 'ఇరుముడి కట్టు'కు మంచి ఓపెనింగ్స్ లభించాయి. విశేషం ఏమంటే. తమిళనాట మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు రెండు ఒకదానికి ఒకటి పోటీ ఇచ్చినట్టుగా అయ్యింది. ఈ సంస్థ కొత్త తారలతో నిర్మించిన 'మొద రాత్రి' సైతం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ లైట్ హార్టెడ్ వెడ్డింగ్ కామెడీ సినిమాను జన్ జీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిషికాంత్, అనిష్మ అనిల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను చేతన్, భగవతి పెరుమాళ్, అబ్దుల్ లీ తదితరులు పోషించారు. పెద్దలు కుదిర్చిన వివాహం