© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Mobile Phone Explodes CCTV Video: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను వనికించే మరో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. ప్యాంట్ జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా బాంబుల పేలడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ నమ్మలేని ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో చోటుచేసుకుంది.
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Mobile Phone Explodes CCTV Video: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను వనికించే మరో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. ప్యాంట్ జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా బాంబుల పేలడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ నమ్మలేని ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన స్మార్ట్‌ఫోన్ వినియోగదారులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు..
ఏం జరిగిందో తెలుసా? జోధ్‌పూర్‌కు చెందిన గోపాల్ సోనీ అనే స్థానిక వ్యాపారి ఎప్పటిలాగే తన దుకాణంలో పనుల్లో నిమగ్నం అయిపోయాడు.. ఆ సమయంలోనే ఆయన ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమయ్యాయి. జేబులో ఏదో కాలుతున్నట్లు గమనించిన గోపాల్.. కంగారుగా ఫోనును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు.. కానీ ఆయన చేతిలోకి తీసుకునే లోపలే ఆ ఫోన్ పెద్ద శబ్దంతో సడన్‌గా పేలిపోయింది.
ఈ ఆకస్మిక పేలుడు కారణంగా గోపాల్ తొడ భాగంతో పాటు ఫోన్ తీయడానికి ప్రయత్నించిన చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.. దుకాణంలో ఉన్న మిగతావారు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు వైద్యులు తెలిపారు.. అంతేకాకుండా కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందని వివరించారు.
సాధారణ ఫోన్లు ఓవర్ హీట్ అవ్వడం వల్లనో.. లేదా చార్జింగ్ పెట్టి మాట్లాడడం వల్లనో పేలుతూ ఉంటాయి. కానీ ఈ ఘటన ఎలాంటి ముందస్తు సంకేతాలు లేవని బాధితుడు గోపాల్ తెలిపారు.. అతను రెండేళ్ల క్రితం వివో కంపెనీకి చెందిన ఫోన్ కొన్నారని.. ప్రమాదం జరగడానికి ముందు ఫోన్ అసలు వేడి కాలేదని.. కనీసం చార్జింగ్ కూడా పెట్టలేదని జేబులో ఉన్నప్పుడు 87 శాతం బ్యాటరీ ఉందని.. అందులో నుంచి పొగలు వస్తాయని అస్సలు ఊహించలేదని తెలిపారు..
ఈ ఘటనపై టెక్ నిపుణులు స్పందిస్తూ.. ఒక్కొక్కసారి లిథియం అయాన్ బ్యాటరీలపై ఒత్తిడి పడడం వల్ల కానీ.. లోపల షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని.. కాబట్టి ఇలాంటి మొబైల్స్ వినియోగించేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని తెలుపుతున్నారు. ఎంతో పాత ఫోన్ అయినా బ్యాటరీ ఉబ్బినట్లు అనిపించిన.. జేబులో గట్టిగా నలిగిన జాగ్రత్తగా ఉండాలి. బ్రాండెడ్ చార్జర్లను మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. కంపెనీ ఫోన్ జేబులోనే పేలిపోవడంతో స్థానిక వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.