
మీ ఫోన్ ఛార్జింగ్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. చేశారో పెద్దప్రమాదంలో పడ్డట్టే
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని లైఫ్‌ను ఊహించుకోవడం కూడా కష్టమే. కాల్స్ మాట్లాడటం దగ్గర్నుంచి ఇంటర్నెట్, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్ వరకు అన్నింటికీ ఫోనే ఆధారం. కూడు, గూడు మాదిరిగా ఫోన్ కూడా మనిషి నిత్యావసర వస్తువుల్లో భాగమయ్యింది. ఇలా నిత్యజీవితంలో ఎంతో కీలకంగా మారిన స్మార్ట్ ఫోన్ ను చాలా జాగ్రత్తగా వాడాలి... ముఖ్యంగా బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. మరీముఖ్యంగా ఛార్జింగ్ తీసేటప్పుడు చాలామంది కామన్ గా ఓ తప్పు చేస్తుంటారు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు... అదే ఫోన్, ఛార్జర్ రెండింటిని డ్యామేజ్ చేయవచ్చు. చాలామంది ఫోన్ లో ఛార్జింగ్ ఫుల్ అయ్యాక ఛార్జర్ కేబుల్‌ను పట్టుకుని గబుక్కున లాగేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పుడు పద్ధతి. ఇలా ఛార్జర్ కేబుల్‌ను లాగినప్పుడు దాని లోపల ఉండే సన్నని వైర్లు, కనెక్టర్పై అనవసరంగా ఒత్తిడి పడుతుంది. పదేపదే ఇలాగే చేస్తే ఛార్జింగ్ కేబుల్ తొందరగా పాడైపోతుంది. అంతేకాదు మీ ఫోన్లో కూడా ఛార్జింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది… కొన్నిసార్లు ఫోన్ బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫోన్ నుండి ఛార్జర్ ను వేరుచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫోన్ నుండి ఛార్జర్ తీసేసే సరైన పద్ధతి ఏంటి? ఫోన్ నుండి ఛార్జింగ్ కేబుల్ తీసేటప్పుడు వైర్‌ను పట్టుకుని లాగకూడదు... ఫోన్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్లాస్టిక్ లేదా మెటల్ భాగాన్ని (కనెక్టర్ హెడ్) వేళ్లతో పట్టుకుని నెమ్మదిగా బయటకు తీయాలి. దీనివల్ల కేబుల్‌పై ఎలాంటి ఒత్తిడి పడదు, అది ఎక్కువ కాలం మన్నుతుంది. ఇలా జాగ్రత్తగా చార్జర్ ను తొలగించడం వల్ల ఫోన్ బ్యాటరీ కూడా సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పాడైపోయినా లేదా వైర్లు బయటకు కనిపిస్తున్నా దాన్ని వాడటం అస్సలు మంచిది కాదు. అలాంటి డ్యామేజ్ అయిన కేబుల్స్.. ఛార్జింగ్
