MAD

Tata Madhu : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. స్పీకర్‌ను దూషించారన్న కేసులో వీరిద్దరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. రూ. 10వేల పూచీకత్తుతో రెండు షూరిటీలను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

షూరిటీలు సమర్పించిన తర్వాత ఎమ్మెల్సీలను విడుదల చేయాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also : Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం.. విధుల్లోనే నవీన్ మిట్టల్ పీఎస్ రాజు మృతి

ఈ ఇద్దరిని మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్ ఓఎస్డీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరిని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి రిమాండ్ విధించేందుకు తిరస్కరించింది.
Tata Madhu : నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట లభించింది. వారిద్దిర రిమాండ్ తిరస్కరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.