ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు పెట్టాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మార్కాపురం జిల్లాకు చంద్రన్న మార్కాపురం అని పేరు పెట్టాలని.. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి కందుల నారాయణరెడ్డి వినతిపత్రం సమర్పించారు. మార్కాపురం జిల్లా పేరును చంద్రన్న మార్కాపురంగా మారుస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని వినతిపత్రంలో కోరారు. చంద్రన్న మార్కాపురం అని నామకరణం చేయాలనేది మార్కాపురం ప్రజల కోరికగా పేర్కొన్నారు.మరోవైపుపశ్చిమ ప్రకాశం వాసుల చిరకాల కోరికను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్కాపురం, పోలవరం జిల్లాలు 2026 జనవరి నుంచి అమల్లోకి కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు పేరును మార్కాపురం జిల్లాకు పెట్టాలని ఎమ్మెల్యే ప్రతిపాదించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.జిల్లా విషయానికి వస్తే.. నాలుగు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో విలీనం చేసింది. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలను కలిపి మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేసింది. మార్కాపురం జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. అలాగే 508 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 14,82,757.24 ఎకరాలుగా నిర్ణయించారు.మార్కాపురం కేంద్రంగా పట్టణాభివృద్ధి సంస్థమరోవైపు మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కొత్తగా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేయనున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్కాపురం జిల్లాలోని 21 మండలాలతో పాటుగా మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, కనిగిరి మున్సిపాలిటీలతో ఈ పట్టణాభివృద్ధి సంస్థ