
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వివాదం మొదలైంది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో ఒక్క సారిగా రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదం పైన పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కు మద్దతుగా నిలిచారు. అయితే, ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా రేవంత్ కు అనుకూలంగా మాట్లాడలేదు. ఈ వ్యవహారం పైన సైలెన్స్ గా ఉన్నారు. అటు హైకమాండ్ సైతం ఈ పరిణామాల పైన సీరియస్ గా ఉంది. విదేశాల నుంచి వచ్చిన తరువాత రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీలో కలకలం మొదలైంది. సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ అధినాయకత్వం ఆలోచనలో పడింది. పార్టీలో నేతల పైన పట్టు తప్పుతుందనే అంశాన్ని గుర్తించింది. కొండా సురేఖ పైన చర్యలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటు క్రమశిక్షణా సంఘం సైతం పూర్తి వివరాలు సేకరించేందు కు సిద్దం అవుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఇప్పటికే ఈ పరిణామాల పైన నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డిపై ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలపైన పలువురు ఎమ్మెల్యేలు స్పందించారు. సురేఖకు గట్టి హెచ్చరిక చేసారు. అయితే, ఈ మొత్తం వ్యవహారం పైన మంత్రులు ఎవరూ స్పందించటం లేదు. తిరుమలకు వెళ్తున్నారా, టీటీడీ కొత్త రూల్- వాటి పై బ్యాన్..!!తాజా పరిణామాల పై ఏఐసీసీ ఫోకస్ప్రభుత్వం లో ఎవరి పైన విమర్శలు వచ్చినా మంత్రులు ధీటుగా స్పందించాలని గతంలోనే సీఎం రేవంత్ స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వాధినేత పైనే విమర్శలు చేస్తుంటే మంత్రులు మౌనంగా ఉంటున్నారు. సుస్మిత గతంలో సీఎం రేవంత్ తో పాటుగా పలువురు మంత్రుల పైనా ఆరోపణలు చేసారు. ఆ తరువాత