చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నేతన్నలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇటీవలే నేతన్న సేవలో పథకం కూడా ప్రారంభించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగాఆగస్ట్ ఏడో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి.. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 25 వేల రూపాయలు చొప్పున జమ చేశారు. అయితే ఇంకా కొంతమంది అర్హులకు నేతన్న సేవలో పథకం లబ్ధి అందలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి సవిత స్పందించారు. సచివాలయంలో సోమవారం రోజు నేతన్న సేవలో పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సవిత.. ఇంకా మిగిలిపోయిన అర్హులకు కూడా నేతన్న సేవలో సాయాన్ని అందించాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి రూ.25 వేలు అందించాలని ఆదేశించారు.రాష్ట్రంలోని 71,536 మంది లబ్ధిదారులకు నేతన్న సేవలో పథకం కింద రూ.25 వేల చొప్పున్న ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి సవిత వివరించారు. అర్హులైన మిగతా వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. నేతన్న సేవలో పథకం కోసం 13,678 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరిలో అర్హులను గుర్తించి వారం రోజుల్లో రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. చేనేతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి సవిత.. 50 ఏళ్లు నిండిన చేనేతలకు పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 85,678 మంది చేనేతలు పింఛన్లు అందుకుంటున్నారని.. 62,541చేనేత కుటుంబాలు ఉచిత విద్యు్త్ ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు.మరోవైపు నేతన్న సేవలో పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు వస్తున్నాయి. చేనేత వృత్తిలో ఏళ్లుగా కొనసాగుతున్న వారిని కూడా.. ఉచిత విద్యుత్ పథకం వర్తించలేదనే సాకుతో దూరం పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి, షెడ్డుల్లో మాస్టర్ వీవర్స్ కింద