
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ #Mega158 / #ChiruBobby2, వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, రా మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. కె. సత్యం, సూపర్వైజర్గా చిరంజీవి ఆక్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌కు ఫోన్ చేసి లోడ్ సమయానికి వస్తుందని చెబుతూ అందరినీ పలకరిస్తారు. సునీల్ లీవ్ అడగగా, తమ టార్గెట్ ఫెస్టివల్ అని చెప్పి లీవ్‌ను తిరస్కరిస్తారు. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ గురించి చెప్పగా సత్యం వాటిని విసరమని చెబుతారు. ఆ కీస్ అనుకోకుండా నీటిలో పడిపోతాయి. అయితే ఓ కుక్క ఒక రిమోట్ తీసుకొస్తుంది. దానితో మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీస్తారు. ఆసక్తికరంగా.. కీస్‌తో పాటు గన్స్ కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత కళ్లద్దాలు పెట్టుకున్న చిరంజీవిని చూపిస్తూ ‘కాకా’ టైటిల్‌ను రివీల్ చేయడం ఆదరిపోయింది. ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్, స్టైలిష్ చిరంజీవి గన్ ఫైరింగ్ సీక్వెన్స్‌తో కనిపించడం గ్లింప్స్‌కు మాస్ టచ్ ఇచ్చింది. ‘కాకా’ టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ గ్లింప్స్ కూడా స్ట్రైకింగ్ విజువల్స్, డిఫరెంట్ సెటప్‌తో వెంటనే ఆకట్టుకుంటుంది. చిరంజీవిని అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు బలంగా కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయడంలో బాబీ కొల్లి మరోసారి తన మార్క్ చూపించారు. రెండు విభిన్నమైన లుక్స్‌ను చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ గ్లింప్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి. చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేశారు. బాబీ మెగాస్టార్‌ను రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రజెంట్ చేశారు. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్ తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. గన్ ఫైరింగ్ సీక్వెన్స్‌లో ఆయన బాడీ