
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంక్స్.. 38 నెలల లోపే 2 లక్షల ఎగుమతులను దాటిందని మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. జూన్ 2023లో ఎగుమతులను ప్రారంభమైనప్పటి నుంచి.. జపాన్‌తో సహా దాదాపు 90 దేశాలకు ఈ కాంపాక్ట్ ఎస్యూవీ చేరుకుంది. 25 నెలల లోపే ఫ్రాంక్స్ తన మొదటి లక్ష ఎగుమతులను సాధించింది. ఆ తర్వాత సుమారు 13 నెలల్లో రెండవ లక్షను ఎగుమతి చేసింది. దీన్నిబట్టి చూస్తే.. మేడ్-ఇన్-ఇండియా మోడల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందనే విషయం స్పష్టమవుతుంది. గుజరాత్‌లోని మారుతి సుజుకి హన్సల్పూర్ ప్లాంట్‌లో తయారైన ఫ్రాంక్స్, కంపెనీ ఎగుమతుల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి.. ఇది భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే ప్యాసింజర్ వాహనంగా నిలిచింది. మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి అయిన మూడు ప్యాసింజర్ వాహనాలు తమ పోర్ట్‌ఫోలియోకు చెందినవేనని ఆ కంపెనీ చెబుతోంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్ముడవుతోంది. దీనిని కంపెనీ భారతదేశంలోని నెక్సా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తోంది. ఇది 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో మాన్యువల్, ఆటోమాటిక్ ఉన్నాయి. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) భారత్ తన కొడుకు ప్రాణాలు కాపాడటంతో పాకిస్థానీ తల్లి భావోద్వేగ సందేశం చిరు & బాలయ్యని కూడా లెక్క చేయలేదు జానీని చూసుకునే ఆమె ఇదంతా.. రూపా