
వెల్దండ: గణేశ్‌ నవరాత్రులను బాధ్యత, భద్రతతో నిర్వహించుకోవాని వెల్దండ సీఐ ఈర్ల రఘువీర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ సర్కిల్ పరిధిలోని వెల్దండ, చారకొండ, వంగూరు మండలాల్లో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో నింబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా అదనపు సౌండ్ బాక్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు. గణేశ్‌ నిమజ్జనాన్ని శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకుంటూ పోలీసులకు సహకరించాలన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




