
వరంగల్లో కొండా సురేఖ దంపతులు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలిసారిగా బర్తరఫ్ చేసిన తర్వాత జరిగింది. ఈ సందర్భంగా
వరంగల్లో కొండా సురేఖ దంపతులు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలిసారిగా బర్తరఫ్ చేసిన తర్వాత జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'బర్తరఫ్ తర్వాత కొందరు అల్లర్లు చేయాలని సూచించారు. కానీ నేను కార్యకర్తలకు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పాను. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు వారికి ధన్యవాదాలు. పదవులు తాత్కాలికంగా ఉంటాయి, కానీ ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం' అని తెలిపారు. ఆమె గతంలో ఎంపీపీ నుంచి మంత్రిస్థాయికి ఎదిగిన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో అవకాశవాదం పెరిగిందని, కొందరు ఉదయం ఒక పార్టీలో, సాయంత్రం మరో పార్టీలోకి మారుతున్నారని వ్యాఖ్యానించారు.
కొండా సురేఖ తన రాజకీయ జీవితంలో చేసిన అనేక నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. 'నేను నమ్మిన రాజశేఖర్ రెడ్డి కోసం గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశాను. కొందరు వార్డు మెంబర్గా రాజీనామా చేయమంటే చేయరు, కానీ నమ్మిన నాయకుడి కోసం నేను రాజీనామా చేశాను' అని ఆమె అన్నారు. గతంలో కొంతమంది గుంటనక్కలు తమకు టికెట్ రాకుండా చేశారని, అయితే కాంగ్రెస్లో టికెట్ రాకపోతే కేసీఆర్ ద్వారా వరంగల్ ఈస్ట్ టికెట్ పొందిన సందర్భాన్ని ఆమె గుర్తించారు. 'నాడు కేసీఆర్ టికెట్ ఇచ్చినందుకు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించాం' అని ఆమె చెప్పారు.






