
హైదరాబాద్: 'ఇంత చిన్న వయసులో నా కూతురు ఎలా చనిపోయింది' అంటూ రోదిస్తోంది ఆనందిని ముఖి. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతి ముఖి తల్లి ఆనందిని. కూతురి మరణవార్త తెలిసి ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒడిశాలో ఉంటున్న ఆమె మీడియాతో తన బాధను పంచుకుంది. నాలుగైదేళ్లుగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని తన కూతురే పోషిస్తోందని, తామంతా ఆమెపైనే ఆధారపడి జీవిస్తున్నామని కన్నీరుమున్నీరయింది ఆనందిని. తమ కుటుంబానికి ఇక దిక్కేవరని రోదిస్తూ వాపోయింది. తన కుమార్తె చావుకు కారణం ఎవరని దీనంగా ప్రశ్నించింది. ''నా కూతురిని ఎంతో కష్టపడి పెంచి, చదివించాను. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్లో సీటు కూడా తెచ్చుకుంది. కోవిడ్ లాక్డౌన్తో బీటెక్ చేయలేకపోయింది. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లింది. మాదాపూర్లో ఇనార్బిట్మాల్లో పనిచేస్తూ మాకు నెలనెలా డబ్బులు పంపిస్తోంది. భారతి సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి.. భారతికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది. భారతితో మాట్లాడించమని అడిగితే.. చనిపోయిందని చెప్పింది. మాకేం చేయాలో అర్థం కాలేదు. హైదరాబాద్ ఎలా వెళ్లాలో కూడా మాకు తెలియదు. ఇంత చిన్న వయసులోనే నా కూతురు ఎలా చనిపోయింది?'' అంటూ ఆనందిని శోకసంద్రంలో ముగినిపోయారు. నెటిజన్ల స్పందన భారతి ముఖి కుటుంబానికి న్యాయం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆనందిని ముఖి మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. 'ఈ కన్నతల్లి ఉసురు మీకు తగులుతుంది. ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. తమ పార్టీ ఎంపీ కొడుకు కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని మరొకరు ప్రశ్నించారు. హైదరాబాద్లో వలస కార్మికులకు జరిగే ప్రమాదాలు/నేరాల విషయంలో బాధితుల పక్షాన నిలబడేవారు