© 2026 nimisham.in

New LIC plans | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఎల్ఐసీ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీమా ప్లాటినమ్ (LIC Bima Platinum), జీవన్ రక్ష (LIC Jeevan Raksha) పేరిట రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి ఈ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ప్లాన్ల వివరాలు ఇవీ.. బీమా ప్లాటినమ్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ప్లాన్. ఇది పొదుపుతో పాటు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కూడా కల్పిస్తుంది. కచ్చితమైన ముందస్తు హామీతో కూడిన రాబడులు లభిస్తాయి. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ప్రతి వెయ్యి రూపాయలకు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 28 ఏళ్లు. గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా నిర్ణయించారు. 7, 10, 12, 15, 18 ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. 17, 20, 22, 25, 28 ఏళ్ల పాటు పాలసీ గడువు ఉంటుంది. కనీస బీమా హామీ మొత్తం రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. పాలసీ మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే బేసిక్ సమ్అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లు చెల్లిస్తారు. జరగరానిది ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. ఎల్ఐసీ పాలసీదారులకు రిబేటు లభిస్తుంది. రుణ సదుపాయం కూడా ఉంది. రైడర్లు జోడించుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం చొప్పున రెగ్యులర్ ఇన్కమ్ కింద ఏటా తీసుకునే వెసులుబాటూ ఉంది. ఎల్ఐసీ జీవన్ రక్ష నాన్-పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే అండగా నిలుస్తుంది. ఈ ప్లాస్ తీసుకోవడానికి కనీస వయసు
18 ఏళ్లు, గరిష్ఠ వయసును 45 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస బీమా హామీ మొత్తం రూ.5 లక్షలు, గరిష్ఠంగా రూ.24 లక్షలు వరకు తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్లలో లభిస్తుంది. మహిళలకు ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి. రైడర్లు జోడించుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.