© 2026 nimisham.in

మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కేసముద్రం(మహబుబాబాద్): మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ...
మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
కేసముద్రం(మహబుబాబాద్): మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామ శివారుల్లోని ఓ గ్రానైట్ క్వారీ వైపు వ్యవసాయ భూమి ఉన్న గండికోట కుమార్ తన పొలం వద్దకు వెళ్లగా చిరుతపులి కనిపించిందని గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం వద్ద దూరంగా చిరుతపులిని చూసిన కుమార్ తీవ్ర భయాందో ళనకు గురయ్యాడు. తన పెంపుడు కుక్కతో సహా సమీపంలోని ఒక బావిగుంతలో దాక్కున్నట్లు పేర్కొన్నాడు. పులి వెళ్లిపోయిన తర్వాత తన పొలంలోని పాదముద్రలను ఫోన్లో ఫోటో తీసి గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయడంతో కలకలం రేపుతోంది.
ఈ పులి ఆయనకు గత రెండు రోజులుగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా మూడు రోజుల క్రితం గూడూరు మండలం బొల్లెపల్లి ప్రాంతంలోనూ చిరుత కనిపించిందని అటవీశాఖాధికారులకు సమాచారం అందింది. అయితే అటవీశాఖాధికారులు వెతికినప్పటికీ పులిజాడ కనిపించలేదని తెలిసింది. ఈ విషయంపై అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ అర్పనపల్లి లో పాదముద్రలు లభించినట్లు గ్రామస్తులు సమాచారం అందించారని, ఇది అడవిపిల్లి పాదముద్రలు కూడా అయి ఉండొచ్చన్నారు. కాగా.. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని వెల్లడించారు.
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News