
హాలహర్వి: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి గతేడాది ఈ సమయానికి 10,333 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా మంగళవారం ఇన్ ఫ్లో జీరోగా నమోదు అయిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 1,627.75 అడుగులకు గాను 85.85 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వివిధ కాల్వలకు, నదికి కలిపి 11,202 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం తగ్గడంతో అన్నదాతలు కలవర పడుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





