అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘కూర్మావతార్’ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను బాలయ్య గారి ‘శాతకర్ణి’ సినిమాలో చేశాను. రీసెంట్గా రామ్ చరణ్ గారి ‘పెద్ది’ సినిమాలో చేశాను. ఇప్పుడు ‘కూర్మావతార్’ సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. నేను ఎప్పుడూ కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అని చూడను. కథ నచ్చితే సినిమా చేస్తాను. దర్శకుడిని నమ్ముతాను. హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో సాయికుమార్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము ఇప్పటివరకు ఎన్నో సినిమాలు కలిసి చేశాం. వరలక్ష్మి శరత్ కుమార్ చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. తను దర్శకత్వం కూడా చేసింది. ఆ సినిమా నేను చూశాను. నాకు చాలా నచ్చింది. ఇందులో కూడా తను చాలా మంచి వర్క్ చేశారు. ప్రేక్షకుల అభిమానులు, ప్రశంసలే మాకు గొప్ప ఎనర్జీ ఇస్తాయి. మరిన్ని మంచి సినిమాలు చేయాలని ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మన నిర్మాతలు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా శివరాజ్ కుమార్ గారితో ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేమందరం చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. మా డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. సాయికుమార్ మాట్లాడుతూ.. శివన్న ఈ సినిమా చేయడం దైవ సంకల్పం. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా మంచి టీమ్‌తో కలిసి సినిమా చేస్తున్నాం. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్. హర్ష కథ చెప్పగానే చాలా నచ్చింది. కూర్మావతారం అనగానే నాకు శ్రీకాకుళం గుర్తొచ్చింది. ఎందుకంటే నేను శ్రీకాకుళం అల్లుడిని. ఆయన ఇందులో చాలా మంచి వేషం చేశారు. శివన్నతో కలిసి నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా అమ్మగారు డాక్టర్ రాజ్‌కుమార్ గారితో కన్నడలో నటించారు. మా నాన్నగారు రాజ్‌కుమార్ గారికి తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. నిజానికి నాకు హీరోని చేసింది కర్ణాటక. పోలీస్ స్టోరీ’ సినిమా లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. మా అందరికీ కూడా కర్ణాటక బ్రేక్ ఇచ్చింది. శివరాజ్ కుమార్ గారి ఫ్యామిలీతో నాకు ఎంతో గొప్ప అనుబంధం ఉంది. చాలా మంచి మనసున్న మనుషులు. శివన్న, నేను కలిసి చాలా మంచి సినిమాలు చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరికీ శ్రీకూర్ముడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ అద్భుతంగా ఉంది. హర్ష అద్భుతంగా తీశారు. ఇందులో ఇప్పటివరకు నేను చేయని ఒక క్యారెక్టర్ చేశాను. శివన్న గారు ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన రావడంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది. అజనీష్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అందరికీ మా అందరిపై ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా పెద్ద జర్నీ. మా రాజ్ తరుణ్, శివన్న గారు, సాయికుమార్ గారు.. ఇలా అందరూ దేవుళ్లలా నాకు తోడుగా నిలిచారు. వాళ్ల సపోర్ట్ నేను మర్చిపోలేను. ముఖ్యంగా శివరాజ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను తొలి సినిమా చేస్తున్న దర్శకుడిని. కథ చెప్పగానే ఆ పాత్రను అంగీకరించిన ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. నిర్మాత నరేంద్ర మాట్లాడుతూ.. నా తొలి సినిమా ఇది. నాకు సినిమాలంటే చాలా పిచ్చి. విష్ణుమూర్తికి సంబంధించిన రెండో అవతారం కథతో ఈ సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. శివన్న గారు, సాయికుమార్ గారు, వరలక్ష్మి గారు.. వీళ్లందరూ అద్భుతమైన వెటరన్ యాక్టర్స్. నా తొలి సినిమాలోనే వాళ్లతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా టీమ్ అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారు ఎంతో గొప్ప విజన్‌తో ఈ సినిమా తీశారు. సినిమాకు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. నిర్మాత పూజిత మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శివన్నకి చాలా థాంక్స్. అలాగే వరలక్ష్మి గారికి, సాయికుమార్ గారికి, రాజ్ తరుణ్ గారికి, మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. మేము ఎంత కష్టపడ్డామో అదంతా మీకు సినిమాలో కనిపిస్తుంది. మా టీజర్‌ను సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. అజనీష్ లోక్‌నాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘కూర్మావతార్’లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. కూర్మావతారం కథను దర్శకుడు చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇలాంటి సినిమాకు తప్పకుండా మ్యూజిక్ చేయాలని అనిపించింది. ఇందులో కాలభైరవ క్యారెక్టర్‌ను శివన్న గారు చేస్తున్నారని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను ‘కాంతారా’లో వరాహ అవతారంపై ఒక పాట చేశాను. దానికి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ‘కూర్మావతార్’ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. Click here for Photogallery