కూర్మ అవతార్’ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను
కూర్మ అవతార్ టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ నిర్మాత దిల్ రాజు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హర్ష వర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కూర్మ అవతార్'. నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్ & రుక్వీణ స్టూడియోస్ బ్యానర్స్ పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ హర్ష సర్ప్రైజ్ చేశాడు. ఈ సినిమా ‘నరసింహ అవతార్’, ‘ఇరుముడి’ సినిమాల్లాగే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. అలాగే రాజ్ తరుణ్ గారు, వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సాయికుమార్ గారు ‘ఇరుముడి’ సినిమాలో మొన్ననే గురుస్వామిగా ఈ రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. ఆ సినిమా మా అందరిలో చాలా గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు అలా తండోపతండాలుగా థియేటర్స్‌కి వస్తుంటే మా అందరికీ ధైర్యం వస్తుంది. ‘ఇరుముడి’ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక మంచి ఎనర్జీ ఇచ్చింది. శివ రాజ్‌కుమార్ గారు ఒక సూపర్‌స్టార్. మొన్ననే పెద్దితో సర్ప్రైజ్ చేశారు. మొన్న ఒక కథ విన్నప్పుడు, ‘ఆ కథ కోసం శివ రాజ్‌కుమార్ గారి దగ్గరికి వెళ్ళండి’ అని మా టీమ్‌కి చెప్పాను. తొందరలోనే వాళ్లు అప్రోచ్ అవుతారు. ఈ టీజర్‌లాగే రెండు గంటల సినిమా కూడా