
తనను మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే తన లక్ష్యమని చెప్పారు. వరంగల్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కొండా సురేఖ దంపతులు సమావేశమై మాట్లాడారు. ‘‘బర్తరఫ్‌ తర్వాత ‘అల్లర్లు చేయాలా’ అని కొందరు మాకు ఫోన్‌ చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి చెప్పాను. పదవి అనేది అలంకారమే.. పదవి లేకున్నా పనులు చేయొచ్చు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోం. కాంగ్రెస్‌ పార్టీని వీడం. ప్రజల్లోనే ఉంటాం. రేవంత్‌ రెడ్డి నాడు రైతుల కోసం పాదయాత్ర చేశారు. రేవంతన్నా.. ‘నీ లాంటి మాస్‌ లీడర్‌ కాంగ్రెస్‌కు అవసరమ’ని చెప్పిన మొదటి వ్యక్తిని నేను’’ అని సురేఖ అన్నారు. ఈ వార్త చదివారా: రోశయ్య దూరదృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్‌: రేవంత్‌రెడ్డి






