
కంపెనీ eMTB బైక్‌తో సిటీల్లో కూడా ఈజీగా తిరగొచ్చు ఈ బైక్‌లో బోష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్ అమర్చారు సింగిల్ ఛార్జ్‌తో 85 మైళ్లు, 140కి.మీ వరకు రేంజ్ Kona El Kahuna Electric Bike : ఈ ఎలక్ట్రిక్ బైకు భలే ఉందిగా.. చూసేందుకు అచ్చం సైకిల్ లాగే ఉంది కదా.. ఇదో కొత్త ఎలక్ట్రిక్ బైకు అంట.. కోనా అనే కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ అందిస్తోంది. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్ పేరుతో లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైకును రిలీజ్ చేసింది. మౌంటెన్ బైక్ అయినా రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైకును సిటీలో తిప్పొచ్చు.. అలాగే కొండల ప్రాంతాల్లో కూడా ఈజీగా నడపవచ్చు. ఇందులో బాష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్, 625 Wh బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌పై 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఎలక్ట్రిక్ బైక్ ధర ఎంతంటే? : కోనా ఈఎల్ అనేది కహునా ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్. దీని ధర 3,499 డాలర్లు (సుమారు రూ. 333,000 లక్షలు). కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా కొనేసుకోవచ్చు. కంపెనీ ఈ బైకును 4 సైజులలో అందిస్తోంది. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ (SM, M, L, XL) ఉన్నాయి. Read Also : Flipkart Freedom Sale 2026 : గేమర్లకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏసర్ గేమింగ్ ల్యాప్‌టాప్ సగం ధరకే.. ఇలా కొంటే ఇంకా తక్కువ..! కహునా ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు : కోనా ఈఎల్ కహునా అనేది కంపెనీ eMTB బైక్. పట్టణ ప్రాంతాలలోనూ ఈజీగా వాడొచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో బోష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్‌ను అమర్చారు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో నడపగలదు. 75Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 625Wh బోష్ పవర్ట్యూబ్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌పై ఈ ఎలక్ట్రిక్ బైక్ 85 మైళ్లు లేదా 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 6061 అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. 136 కిలోల వెయిట్ మోయగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 10-స్పీడ్ మైక్రోషిఫ్ట్ అడ్వెంట్ డ్రైవ్‌ట్రెయిన్ అమర్చారు. బాష్ ఇంటువియా 100 డిస్ప్లే కూడా ఉంది. రైడర్ స్పీడ్, దూరం, బ్యాటరీ లెవల్ మొదలైన వివిధ డేటాను చూడవచ్చు. కోనా ఈఎల్ కహునాలో 29 x 2.25 అంగుళాల ష్వాల్బే జి-వన్ టైర్లను అమర్చారు. ఇందులో టెక్ట్రో జెమిని బ్రేకులను వాడారు. కంపెనీ ఫ్రంట్, బ్యాక్ సైడ్ లైట్లతో సహా అనేక యాక్సెసరీలను అందిస్తోంది. ఇందులో కిక్‌స్టాండ్ కూడా అందుబాటులో ఉంది. తేలికపాటి లగేజీ కోసం బ్యాక్ ర్యాక్ కూడా ఉంది.
Found this helpful?
Share this story with your network







