
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో దేశభక్తిని చాటేలా అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. స్వాత్యంత్ర వేడుకల్లో ఏయే జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేయనున్నారనేది తెలంగాణ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 32 జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా వందనం చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో రాజధాని హైదరాబాద్‌లో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటలకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, శాసనసభ/శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
జిల్లా.. జెండా ఆవిష్కరించే మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ – ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్
భద్రాద్రి కొత్తగూడెం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హనుమకొండ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి – ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జోగులాంబ గద్వాల – ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి
కామారెడ్డి – ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
కరీంనగర్ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఖమ్మం – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కుమురంభీం ఆసిఫాబాద్ – శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
మహబూబాబాద్ – ప్రభుత్వ విప్ జె. రాంచందర్ నాయక్
మంచిర్యాల – ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు
నాగర్‌కర్నూల్ – ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి
నిజామాబాద్ – ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి
పెద్దపల్లి – ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
రాజన్న సిరిసిల్ల – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రంగారెడ్డి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సూర్యాపేట – మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
వికారాబాద్ – శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వనపర్తి – శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి





