
కాఫీ పొడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. బెస్ట్ టిప్స్కాఫీ పొడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. బెస్ట్ టిప్స్ August 18, 2026 Subhash కాఫీ పొడిని సరిగ్గా నిల్వ చేసినప్పుడే దాని తాజాతనం, రుచి, సువాసన కాలక్రమేణా మారకుండా ఉంటాయి. గాలి, తేమ, వేడి, వెలుతురు నుండి కాఫీ పొడిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాఫీ పొడి కాఫీ పొడి ఫ్రెష్‌గా ఉండటానికి గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచడం అత్యంత ముఖ్యం. బయటి గాలి తగిలితే కాఫీ పొడి త్వరగా ఉండలు కడుతుంది. ప్లాస్టిక్ కంటే గ్లాస్ జార్లను ఉపయోగించడం మంచిది. డబ్బాలో అధిక వేడి, సూర్యరశ్మి కాఫీ అసలు రుచిని పాడుచేస్తాయి. అందుకే దీనిని ఎల్లప్పుడూ చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. గ్యాస్ స్టవ్ లేదా ఓవెన్‌కు దూరంగా ఉంచాలి. చల్లని, వెలుతురు చాలామంది కాఫీ పొడి ఫ్రెష్‌గా ఉంటుందని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఫ్రిజ్ లోపల ఉండే తేమ వల్ల కాఫీ పొడి త్వరగా పాడవుతుంది. క్వాలిటీ, రుచి దెబ్బతింటుంది. ఫ్రిజ్‌లో పెట్టకూడదు మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాఫీ పొడిని కొనుగోలు చేసినట్లయితే, దాన్ని చిన్న చిన్న డబ్బాల్లోకి తీసి ప్రైవేట్‌గా నిల్వ చేసుకోండి. దీని వల్ల మిగతా డబ్బలకు గాలి తగలదు. చిన్న చిన్న భాగాలుగా కాఫీ పొడిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి 'వ్యాక్యూమ్-సీల్డ్' బ్యాగ్‌లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి లోపల ఉండే గాలిని పూర్తిగా బయటకు పంపి, కాఫీ పొడి ఫ్రెష్నెస్గా ఉంచుతుంది. వ్యాక్యూమ్-సీల్డ్ టేస్టీకి కాఫీ తయారు చేయాలనుకుంటే కాఫీ పొడి ప్యాకెట్‌పై ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. అలాంటి కాఫీ పౌడర్ ఎక్స్పైరీ డేట్ దాటుతుందనుకుంటే కొనకపోవడమే మంచిది. ఎక్స్పైరీ డేట్ ఇలాంటి టిప్స్ పాటించినట్లయితే మీ ఇంట్లో ఉంటే కాఫీ పౌడర్ ఎప్పుడు కూడా తాజాగా ఉంటుంది. చాలా మంది ఈ టిప్స్ పాటించరు. ఎప్పుడు తాజాగా..
మరిన్ని వెబ్ స్టోరీస్ ఏసీకి గడువు ఉంటుందా? ఎన్నేళ్ల పాటు వాడవచ్చు..? ఇవి గుర్తించుకోండి టీవీని ఎంత దూరం నుంచి చూస్తే మంచిదో తెలుసా..? ఆధార్ ఉన్న వారికి గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు ఉచితంగానే..!




