
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్ల పోలీస్ గ్రౌండ్లో జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు ఉల్లాసంగా జరిగాయి. ఈ పోటీలను చర్ల సీఐ ఎ. రాజు వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి జూనియర్ అథెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అత్యధిక పతకాలు తెచ్చి పెట్టేలా క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహిధర్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో 45 మంది క్రీడాకారులను ఎంపిక చేసి, ఈనెల 26న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు పంపుతామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.