
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఓ గురుకులంలో పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలు ఈ ఘటనకు దారితీశాయి. పది విద్యార్థులు ఇంటర్ విద్యార్థులపై కబడ్డీ పోటీలో గెలుపొందారు. విషయాన్ని మనసులో పెట్టుకున్న ఇంటర్ విద్యార్థులు శనివారం పదో తరగతి విద్యార్థులపై మూకుమ్మడిగా దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం పాఠశాలకు వచ్చి ఘటనపై ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాలలో తమ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారు అంటూ ప్రశ్నించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.