
ఖమ్మం కార్పొరేషన్ : కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నగరపాలక సంస్థ కార్యాలయానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు, వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తులు అందజేసేందుకు బారులు తీరారు. గతంలో దరఖాస్తు చేసిన వారు ప్రస్తుతం కొత్తగా రూపొందించిన దరఖాస్తులు జత చేసి ఇవ్వాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.