
కొత్తగూడెం విద్యావిభాగం : కొత్తగూడెంలోని ప్రభుత్వ రామచంద్ర డిగ్రీ కళాశాలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్(జేడీ) రాజేంద్ర సింగ్ పరిశీలించారు. ఇటీవల ఈ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా సాధించిన నేపథ్యంలో కళాశాలలో ఉన్న వనరులను, కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమై, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా క్రమశిక్షణతో కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.