
సత్తుపల్లి: మండల పరిధిలోని స్థానిక రింగ్ సెంటర్‌లో మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహాలను ఆర్టీసీ డీఎం గురిజాల లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. పర్యావరణహితం కోరుతూ దాదాపు తొమ్మిదేళ్లుగా మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని డీఎం తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ వీరపనేని రాధిక మట్టి గణపతి ప్రతిమలను ఇంటింటికి పంపిణీ చేశారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ హితం కోరుతూ దాదాపు 500 మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





