
Junior Ntr Expresses Condolences Over Shavukaru Janaki Death
తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నటి 'షావుకారు' జానకి (94) మరణవార్తపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నటి 'షావుకారు' జానకి (94) మరణవార్తపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.విలక్షణమైన పాత్రలతో చెరగని సంతకం చేసిన జానకి గారి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణం, వెండితెరపై ఆమె జీవం పోసిన విలక్షణమైన పాత్రలు తరతరాల సినీ ప్రేమికుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






