టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయపడ్డారనే సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు ఆయన భుజానికి గాయమైందని, వైద్యులు 6-8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తారక్ టీమ్ వెల్లడించింది. తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేయనున్నారు.హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో రేపు బుధవారం(ఆగస్టు 12) ఎన్టీఆర్కు శస్త్రచికిత్స జరగనుంది. వైద్యుల సలహా మేరకు ఆయన సర్జరీ చేయించుకోనున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ''భుజానికి గాయం అయిన తర్వాత వైద్యుల సలహా మేరకు, ఎన్టీఆర్ గారు కిమ్స్ హాస్పిటల్స్ హైదరాబాద్లో రేపు భుజానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. వైద్యుల బృందం NTR త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకునే దిశగా వైద్యం అందిస్తోంది. శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాము. ధన్యవాదాలు'' అని ప్రకటనలో పేర్కొన్నారు.ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగనుందని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు
.