
గవర్నర్‌ను కలిసిన జోగి మేఘన గృహహింస కేసుపై రక్షణ విజ్ఞప్తి తగిన చర్యలకు రాజ్‌భవన్ ఆదేశం Jogi Meghana: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో తలెత్తిన వరకట్న వేధింపుల వివాదం మళ్ళీ తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారంలో జోగి రమేష్ కోడలు జోగి మేఘన(Jogi Meghana) స్వయంగా విజయవాడ రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలిశారు. తన భర్త జోగి రాజీవ్, అత్తమామల నుండి తనకు ఎదురవుతున్న తీవ్రమైన గృహహింస, అదనపు కట్నం వేధింపులపై నమోదైన పోలీసు కేసుల పురోగతి గురించి గవర్నర్‌కు వివరించి, వినతిపత్రాన్ని సమర్పించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. CM Revanth: దళితులు నడిచారని రోడ్డు శుద్ధి చేస్తారా? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్.. సమగ్ర విచారణకు ఆదేశాలు పోలీసు కేసుల పురోగతిపై వివరణ.. రక్షణ కల్పించాలని విజ్ఞప్తి: రాజ్‌భవన్ భేటీలో మేఘన తనకు ఎదురైన చేదు అనుభవాలను, ఎదుర్కొంటున్న వేధింపుల వివరాలను గవర్నర్‌కు క్షుణ్ణంగా వివరించారు. తాను పెట్టిన కేసుల విచారణ వేగవంతంగా జరిగేలా చూడాలని, తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని వేడుకున్నారు. చట్టపరంగా తనకు త్వరితగతిన పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని, ఈ విషయంలో రాజ్‌భవన్ జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన రాజ్‌భవన్.. తగిన చర్యలకు అధికారులకు ఆదేశం: బాధితురాలు జోగి మేఘన సమర్పించిన వినతిపత్రంపై రాజ్‌భవన్ వర్గాలు వెంటనే సానుకూలంగా స్పందించాయి. ఆమె తెలిపిన విషయాలను తీవ్రంగా పరిగణించిన గవర్నర్, ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు విచారణను వేగవంతం చేసి, బాధితురాలికి న్యాయం చేకూరేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను సూచించినట్లు రాజ్‌భవన్ వర్గాల నుంచి ప్రాథమిక సమాచారం అందింది.