ఒకప్పుడు అన్నదానం మహాదానం అనేవారు.. కానీ ప్రస్తుత సమయంలో అవయవ దానం మహాదానంగా మారింది. ఏదో ఒక అవయవం చెడిపోయి.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి.. ఆ అవయవాన్ని ఎవరైనా చనిపోయిన వారిది దానం చేస్తే.. ఒక ప్రాణం నిలబడుతుందని.. ఎంత చెప్పినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. అది మాత్రం పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. కావాల్సిన సమయానికి అవయవం అందక.. చనిపోతున్న వారి లెక్కలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. తెలంగాణలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.రాష్ట్రంలో 2013 నుంచి 2026 వరకు జీవదాన్ కార్యక్రమం కింద అవయవ మార్పిడి కోసం నమోదు చేసుకున్న 19,386 మంది రోగుల్లో కనీసం 4,106 మంది అవయవం కోసం ఎదురుచూస్తూనే మరణించారని లెక్కలు చెబుతున్నాయి. అంటే దాదాపు ప్రతి ఐదుగురు రోగుల్లో ఒకరు అవయవం అందక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక జీవదాన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ కాలంలో 5,307 మందికి విజయవంతంగా అవయవ మార్పిడి జరిగింది. అయితే మరో 9,413 మంది ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. దీంతో అవయవ దానానికి, మార్పిడి అవసరాలకు మధ్య ఉన్న భారీ అంతరం మరోసారి స్పష్టమవుతోంది.తెలంగాణలో ఏడాదికి సుమారు 7500-8000 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నప్పటికీ.. వార్షిక అవయవ దానాల సంఖ్య మాత్రం వెయ్యిలోపే ఉండటం గమనార్హం. 2025లో అత్యధికంగా 763 అవయవ దానాలు నమోదు అయ్యాయి. అవయవం కోసం ఎదురుచూస్తూ మరణించిన వారిలో ప్రధానంగా ఐదు అవయవాల కోసం ఎదురుచూసినవారే ఎక్కువగా ఉన్నారని ఆ లెక్కలు చెబుతున్నాయి. కాలేయం కోసం 2,240 మంది.. కిడ్నీ కోసం 1,537 మంది.. ఊపిరితిత్తులు కోసం 229 మంది.. గుండె కోసం 96 మంది.. ప్యాంక్రియాస్ కోసం 4 మంది ఎదురుచూస్తున్నారు. 2013-2026 మధ్య జీవదాన్ కార్యక్రమానికి 1,724 కిడ్నీలు.. 1,724 కాలేయాలు.. 506 ఊపిరితిత్తులు.. 258