
పిఠాపురం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఆడియో సందేశం ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘‘చెయ్యొత్తి జై కొట్టు’ నినాదం మనందరినీ ఎంతో కదిలిస్తుంది. ఆ స్ఫూర్తిని మీకు అందించాలనే అధినేత పవన్ ఈ లోగో పెట్టారు. జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. అరుపులు.. కేకలు కాదు.. క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధినేత ఆదేశాలను జనసైనికులు క్రమశిక్షణతో పాటించాలి’’ అని సూచించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది
.