
ఓర్వకల్లు: వైకాపా అధినేత జగన్ (Jagan) కర్నూలు పర్యటనలో అడగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్‌లతో స్టంట్స్ చేస్తూ జనానికి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలు జిల్లా కారాగారంలో ఉన్న ఆలూరు వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అనుమతులు లేకపోయినా అక్కడి నుంచి భారీ ర్యాలీతో కర్నూలు బయల్దేరారు. దీంతో పలు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా.. వైకాపా నాయకులు ఖాతరు చేయకుండా భారీ జనసమీకరణ చేసినట్టు సమాచారం. జగన్ కాన్వాయ్ తొందరగా వెళ్లాలని రూరల్ సీఐ చంద్రబాబు కోరగా.. వైకాపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆయన వాహనానికి అడ్డుగా నిలిచి ఆందోళన చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అమరావతిలో రాజధాని నిర్మించాలని నిర్ణయించినప్పుడు మీడియా దిగ్గజం దివంగత రామోజీ రావు తనకు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు