ITR 3,4,5,7 Filing: ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు గడువు జులై 31తోనే ముగిసిపోయిందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ ఏడాది నుంచి కొన్ని కేటగిరీల ట్యాక్స్ పేయర్లకు ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువును ఆగస్టు 31 వరకు అందించారు. ఈ క్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లకు ఆదాయపు పన్ను శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. అసెస్మెంట్ ఇయర్ 2026-27కు గానూ వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం (Business Or Professional Income) కలిగి ఉండి, ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆడిట్‌తో ప్రమేయం లేని వ్యక్తులు, సంస్థలు తమ ఐటీఆర్‌ను సమర్పించేందుకు చివరి తేదీ ఆగస్టు 31 వరకుమాత్రమేనని తెలిపింది. తమ ఖాతాలు ఆడిట్ అవసరం లేని, ఐటీఆర్ 3, 4, 5, 7 ఫారాలు సమర్పించే వారు వెంటనే ఆ పని పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. ఐటీఆర్- 3 (ITR-3) ఫారాన్ని వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఫైల్ చేయవచ్చు. ఐటీఆర్-4 (ITR-4 Sugam) ఫారాన్ని సెక్షన్ 44ఏడీ, 44ఏడీఏ, 44ఏఈ కింద ప్రిజెంప్టివ్ టాక్సేషన్ స్కీమ్ ఎంచుకున్న చిన్న వ్యాపారులు, నిపుణులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్-5 (ITR-5) ఫారాన్ని భాగస్వామ్య సంస్థలు, ఎల్ఎల్పీలు, ఏఓపీ, బీఓఐలు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్-7 (ITR-7) ఫారాన్ని చారిటబుల్ ట్రస్టులు, రాజకీయ పార్టీలు, పరిశోధనా సంస్థలు, ఇతర ప్రత్యేక కేటగిరీల్లోని ట్యాక్స్ పేయర్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది.ఐటీ శాఖ కీలక ప్రకటనఆగస్టు 31వ తేదీ సమీపిస్తున్న క్రమంలో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం కీలక హెచ్చరిక చేసింది. చివరి నిమిషంలో ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగి సాంకేతిక సమస్యలు లేదా సర్వర్ స్లో అయ్యే ప్రమాదం ఉందని, ముందే ఫైల్ చేయడం