
ప్రతి ఊరిలోనూ తాగునీటి అవసరాలు తీర్చే వాటర్ ప్లాంట్లు ఉంటున్నాయి. స్థానికంగానే శుద్ధ జలం లభిస్తోందని ప్రజలంతా ఈ నీరే తాగుతారు. రోజూ తాగుతున్నా అసలు ఈ నీరు శుభ్రమైనదేనా..? ప్లాంట్ల నిర్వాహకులు తగిన ప్రమాణాలు పాటిస్తుంటారా..? అనే సందేహం ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది. ఇంట్లోనే నీటి ప్రమాణాలు తెలుసుకునే పరికరాలు ఉంటే... క్షణాల్లోనే పరీక్షించి నీటి నాణ్యతను గుర్తించొచ్చు. మార్కెట్లో పలు రకాల మల్టీ పారామీటర్ కెమికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని రకాల లిక్విడ్లు, స్ట్రిప్స్ ఉంటాయి. వీటిద్వారా నీటి గాఢత, క్లోరిన్, నైట్రేట్లు, సల్ఫేట్ల మోతాదు, ఫ్లోరైడ్ పరిమాణం తెలుస్తుంది. దీని విలువ రూ.1500-3000 వరకు ఉంటుంది. ఈ పరికరంతో నీటిలోని టీడీఎస్ స్థాయిని కనుక్కోవచ్చు. కాల్షియం, మెగ్నీషియం, సోడియం ఖనిజాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెబుతుంది. విలువ రూ.150-400 మధ్య ఉంటుంది. ఇది మార్కెట్లో రూ.350 నుంచి రూ.1000 ధరకు లభిస్తుంది. నీటి పీహెచ్ విలువను ఈ పరికరంతో గుర్తించవచ్చు. పీహెచ్ విలువ 6.5 కన్నా తక్కువుంటే ఆ నీరు తాగటం ఆరోగ్యానికి హానికరం. ఈ పరికరం నీటి రంగులో మార్పు ఆధారంగా క్లోరిన్, ఫ్లోరైడ్, ఐరన్, నైట్రేట్ల స్థాయులను డిజిటల్ తెరపై చూపిస్తుంది. ధర రూ.1,800-4,500 మధ్య ఉంటుంది. ఆర్వో ప్లాంట్లలో పైపులు, ట్యాంకులు శుభ్రంగా లేకుంటే నీటిలో బ్యాక్టీరియా (ఈ-కోలి వంటి) చేరే అవకాశం ఉంది. ఈ కిట్‌లోని చిన్న బాటిల్లో నీరు పోసి 24-48 గంటలు ఉంచాలి. ఒకవేళ బ్యాక్టీరియా ఉంటే రంగు మారుతుంది. దీని ధర రూ.500-1500 మధ్య ఉంటుంది. తాగునీటిలో టర్బిడిటీ స్థాయులు 1 ఎన్టీయూ కంటే తక్కువగా ఉండాలి. ఆర్వో ప్లాంట్లలోని నీరు శుభ్రంగానే కనిపించినప్పటికీ మట్టి, ఇసుక, సూక్ష్మ కణాలుంటాయి. ఈ పరికరం ద్వారా నీటిలోని టర్బిడిటీ స్థాయిని గుర్తించవచ్చు. దీని విలువ రూ.4-12వేల వరకు ఉంటుంది. ఆర్వో ప్లాంట్లలో పాత పైపులు, ట్యాంకుల వల్ల నీటిలో